ఈపూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ దాడులు

ఈపూరు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ దాడులు

PLD: ఈపూరు మండలంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు అరేపల్లి, ముప్పాళ్ళ, ఈపూరు, రొంపిచర్ల గ్రామాల్లోని మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించారు. దుకాణాల్లో నిల్వ ఉన్న మద్యం నాణ్యత, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద మద్యం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు.