తిరుపతి SVUలో నియామకాలపై హైకోర్టు స్టే..!
TPT: తిరుపతి SVUలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై హైకోర్టు స్టే విధించిందని అకడమిక్ కన్సల్టెంట్ల సంఘ అధ్యక్షుడు కిషోర్ వెల్లడించారు. పని చేస్తున్న 50 మందిని తొలగించి, అత్యవసరంగా 23మంది నియామకానికి ఎస్వీయూ దరఖాస్తులు తీసుకుందన్నారు. అప్లికేషన్ పూర్తి చేయడంపై తాను హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. వర్సిటీ అధికారుల తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసారు.