అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
జగిత్యాల గోవింద్ పల్లిలో నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో నవదుర్గ పీఠ క్షేత్రం దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలకు జగిత్యాల MLA సంజయ్ కుమార్ హాజరై దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు. పీఠంలో ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు.