‘ఉస్తాద్’ రిపీట్‌గా చూసే సినిమా: హరీష్ శంకర్

‘ఉస్తాద్’ రిపీట్‌గా చూసే సినిమా: హరీష్ శంకర్

టాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో మంచి ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలమైందని.. ఆ లోటు ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’ తీరుస్తుందని దర్శకుడు హరీష్ శంకర్ అన్నాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. ఇది పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడికి కూడా నచ్చుతుందని తెలిపాడు. ఆడియన్స్ రిపీట్‌గా చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించానని స్పష్టం చేశాడు.