బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీస్ సిబ్బంది

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీస్ సిబ్బంది

BHPL: చిట్యాల మండలం లక్ష్మీపురం తాండ గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ సమచారం ప్రకారం.. విషయాన్ని తెలుసుకున్న చిట్యాల ఎస్ఐ ఈశ్వరయ్య, అరి రాజు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందితో వెళ్లి పెళ్లిని ఆపారు. బాలికను ఆమె తల్లిదండ్రులను, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది కౌన్సెలింగ్ కోసం భూపాలపల్లి ఆఫీసుకు తీసుకెళ్లారు.