జనగణనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
KMM: సత్తుపల్లి పట్టణంలోని తల్లాడ రైతు వేదికలో ఈ నెల 27 నుంచి మే 2 వరకు జనగణన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు MRO కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 120 మంది ఉపాధ్యాయులకు జనగణన విధానాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు జరుగుతాయని, పాల్గొనాల్సిన వారు సమయానికి తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.