సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: ఎమ్మెల్యే

MBNR: అనారోగ్యానికి గురైనప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేందుకు ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బోయపల్లికి చెందిన అక్షయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆమె వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన CMRF రూ.2,50లక్షల ఎల్వోసీ కాపీని శుక్రవారం బాధితురాలి తండ్రికి ఎమ్మెల్యే అందజేశారు.