ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామికి విశేషాలంకరణ
పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విశేషా అలంకరణ నిర్వహించారు. మార్గశిర పౌర్ణిమ సందర్భంగా పంచామృత అభిషేకాలు, అర్చకులు శ్రీకాంతాచార్యులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారి దివ్య దర్శనం పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.