VIDEO: విద్యార్థిని ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
ATP: అసభ్య ప్రవర్తన, వికృత చేష్టలతో విద్యార్థిని స్పందన (17) మృతికి కారణమైన బాలుడిని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. గత నెల 26న దాడికి గురైన విద్యార్థిని స్పందన మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడిపై పోక్సో, ఐపీసీ 305 సెక్షన్లు నమోదు చేశామని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు.