ఆకట్టుకున్న పది అడుగుల శివలింగం
AKP: నర్సీపట్నం మరిడమ్మ పండగ సందర్భంగా మున్సిపాలిటీ మూడో వార్డు గోపన్న వీధికి చెందిన ముత్యాల వెంకటేశ్వరరావు అలియాస్ వెంకట్ పది అడుగుల శివలింగాన్ని తయారు చేశారు. శివలింగాన్ని బుధవారం సాయంత్రం జరిగే జాతరలో ప్రదర్శిస్తారు. ప్రతి మరిడమ్మ పండగకు వెంకట్ చక్కని ఆకృతి గల దైవ స్వరూపాలను తయారు చేస్తారు. జాతరలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.