చేనేతలకు ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్: మంత్రి

చేనేతలకు ఏప్రిల్ నుంచి ఉచిత విద్యుత్: మంత్రి

KRNL: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శుక్రవారం శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి ప్రకటనతో చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.