UPDATE: గట్టిగా పేలిన శబ్దం వినిపించింది
HYD: జలవిహార్‌లోని ఆర్వో ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. వీకెండ్ ఉందని జలవిహార్‌కు వచ్చామని ఇంతలో పేలిన శబ్దం వినిపించిందని ఓ వ్యక్తి తెలిపాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వాళ్లను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించామన్నారు. వాళ్లకు జరిగిన నష్టానికి సహాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.