VIDEO: బీజేపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ నేత బెదిరింపులు
SRCL: సిరిసిల్ల 30వ వార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి హరీషపై బీఆర్ఎస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని ఆమె వాపోయింది. ఓటుకు రూ.10 వేల నుంచి 20 వేలు పంచుతున్నారని ప్రశ్నించినందుకు.. "ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, దాడులు చేస్తాం" అని బెదిరించినట్లు హరీష ఆరోపించారు. శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.