'రోడ్డు మరమ్మతు పనులు చేపట్టండి'
JN: స్టేషన్ ఘనపూర్ మండలం నుండి జఫర్గడ్ మండలానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వాహనాదారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.