భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం

విజయనగరం: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం ముచ్చువాని చెరువు గట్టు వద్ద సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు జగన్మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో రెండు సార్లు విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు.