'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం'

'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం'

GDWL: వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో లక్ష్మీదేవి అనే లబ్ధిదారురాలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం జరిగిన గృహప్రవేశంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల సహాయం అందుతుందని పేర్కొన్నారు.