ఈనెల 18 నుంచి సదరం క్యాంపు ఏర్పాటు

ఈనెల 18 నుంచి సదరం క్యాంపు ఏర్పాటు

ASF: జిల్లా కేంద్రంలో నిర్వహించే సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు మంగళవారం కోరారు. జిల్లా వైద్యశాలలో ఈ నెల 18న సికిల్ సెల్, తలసేమియా, 19 మానసిక వైకల్యం, 20న ఎముకలు, 24న మూగ, చెవిటి, 26న కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా మీ సేవలో స్లాట్ బుక్ చేసుకొని హాజరుకావాలని పేర్కొన్నారు.