శ్రీశైలంలో తొమ్మిదో రోజుకు చేరిన బ్రహ్మోత్సవాలు
NDL: శ్రీశైల క్షేత్రంలో తొమ్మిదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల రథోత్సవం వైభవంగా జరగనుంది. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లింగోద్భవ దర్శనం జరిగింది. వాయులింగేశ్వరస్వామి, ప్రసూనాంబికా దేవిని లక్షమందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజే దర్శనం టికెట్లతో రూ.55 లక్షల ఆదాయం వచ్చింది.