రోడ్డెక్కి లబ్ధిదారుల ఆందోళన
SRD: అందోల్ -జోగిపేట మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు సోమవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఆందోల్ పట్టణం పరిధి కుమ్మరి గూడెం డబుల్ బెడ్ రూమ్‌లలో డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని కాలనివాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు.