రిటర్నింగ్ వాల్ నిర్మించాలని వైసీపీ డిమాండ్

రిటర్నింగ్ వాల్ నిర్మించాలని వైసీపీ డిమాండ్

GNTR: కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో మంగళగిరి మండల వైసీపీ ఇన్ ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి వరద నీటిని బుధవారం పరిశీలించారు. ఇప్పటికే 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని.. మరో రెండు 3 లక్షల క్యూసెక్కులు పెరిగితే మహానాడు ప్రాంతంలోకి వరద వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహానాడులో వెంటనే రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.