BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అజ్మీర ప్రహ్లాద్

BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అజ్మీర ప్రహ్లాద్

ములుగు జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు అజ్మీర ప్రహ్లాద్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రహ్లాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, విస్తరణ కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.