మనవడి మరణ వార్తతో నాన్నమ్మ మృతి
VZM: మనవడి మరణం తట్టుకోలేక గుండె ఆగి నాన్నమ్మ మృతి చెందిన ఘటన ఎస్.కోట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. లచ్చం దొరపాలెంకు చెందిన కన్నాలమ్మ(60)కు తన మనవడు గంగరాజు అంటే అమితమైన ప్రేమ. కాగా, అనారోగ్యంతో మనవడు మృతి చెందాడన్న వార్త విని కన్నాలమ్మ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.