ఎన్నికలపై ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్సై

ఎన్నికలపై ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్సై

విజయనగరం: బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో బొండపల్లి ఎస్సై లక్ష్మణరావు ఎన్నికలపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి కేసుల్లో ఇరుక్కోవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.