VIDEO: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. కొట్లాట

E.G: అనంతపల్లి సెంటర్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో నల్లజర్ల సీఐ బాలసౌరి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎస్పీ నర్సింహ కిషోర్ ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది.