గుండెపోటు..హోంగార్డు మృతి

తూర్పు గోదావరి: జిల్లాలో విషాదం నెలకొంది. రాజానగరానికి చెందిన హోంగార్డు కెల్లా సురేంద్ర (33) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఉదయమే విధుల నిమిత్తం రాజమండ్రికి వెళ్లిన ఆయన.. హాజరు పట్టికలో సంతకం పెట్టే సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.