'సమాజంలో శాలివాహన సంక్షేమ కృషి ఎనలేనిది'
E.G: రాజమహేంద్రవరం శాలివాహన సంక్షేమ సంఘం వారు ఆదివారం నిర్వహించిన 23వ వార్షిక సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. శాలివాహన వర్గాల అభ్యున్నతికి, సమాజ సేవకు సంఘంచేస్తున్న విశిష్టమైన కృషిని అభినందిస్తూ, సంఘం నాయకులు, సభ్యులకు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. శాలివాహన సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.