'బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి'
తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.శ్రీ లక్ష్మి సోమవారం రాజమండ్రిలోని ప్రభుత్వ బాలికల సదనమును సందర్శించి వసతులను పరిశీలించారు. అనంతరం నగరంలోని SC బాలుర, ST, BC బాలికల వసతి గ్రహాలను సందర్శించి విద్యార్ధులతో మాట్లాడి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు.