గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ప్రారంభం

గృహ నిర్మాణ శాఖ కార్యాలయం ప్రారంభం

 AKP: ఎస్ రాయవరంలో గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని అధికారులు బుధవారం ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కార్యాలయం ఇప్పటివరకు మూతపడి ఉంది. దీనికి అన్ని వసతులు కల్పించడంతో హౌసింగ్ ఈఈ నాగేశ్వరరావు ప్రారంభించారు. లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ రమేష్ బాబు పాల్గొన్నారు.