వర్షాలకు కొట్టుకపోయిన మట్టిరోడు

NRPT: మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామం నుంచి బుద్ధునాయక్ తండాకు వెళ్లే మట్టి రోడ్డు భారీ వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే తండావాసులు, పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డును తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.