నురగతో వస్తున్న తాగునీరు

నురగతో వస్తున్న తాగునీరు

బాపట్ల: పట్టణంలోని 10వ వార్డు ప్యాడిసన్ పేటలో మున్సిపాలిటీ ద్వారా వస్తున్న తాగునీరు తీవ్ర దుర్వాసన వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం వచ్చిన తాగునీరు నురగలు కక్కుతూ భరించలేని దుర్వాసన వస్తుందని అన్నారు. ఈ నీరు తాగడానికి ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి శుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు అన్నారు.