చేవెళ్ల బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: కేటీఆర్
HYD: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే స్పందించి మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించారు.