VIDEO: రెండో అంతస్తు నుంచి కిందపడి హోంగార్డుకు తీవ్రగాయాలు
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బజార్ వాడీలోని అద్దె ఇంట్లో నివాసమున్న హోంగార్డు ప్రకాష్ జాదవ్ ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆయనను మున్సిపల్ వైస్ ఛైర్మన్ అహ్మద్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.