VIDEO: వృద్ధురాలు దిన స్థితిపై స్పందించిన పోలీసులు
ELR: లింగపాలెం మండలం ములుగులం పాడు గ్రామంలో వృద్ధురాలి దీనస్థితి పై ధర్మాజీగూడెం పోలీసులు స్పందించారు. గ్రామానికి చెందిన ఒక వృద్ధురాలిని ఆమె కుమారులు నిర్లక్ష్యం చేయడంతో, నిలువ నీడ లేక ఇంటి బయట చెట్టు కింద కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి వెంటనే ఆమె మేనమామ ఇంటి వద్ద నివాసం ఏర్పాటు చేశారు.