ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

KMR: లింగంపేట మండలం మేంగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 30 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరగని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందున తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని నాయకులు తెలిపారు.