కాకతీయ జూ పార్కులో వైట్ టైగర్ మృతి
హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ జూ పార్క్‌లో మంగళవారం తెల్ల పులి గుండె పోటుతో మృతి చెందింది. దాదాపు 14 సంవత్సరాలుగా జూ పార్కులో పర్యాటకులకు కనిపిస్తూ కనువిందు చేస్తున్న వైట్ టైగర్ మృతి చెందడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.