GNTR: పొన్నూరులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం
GNTR: పొన్నూరు పట్టణం మార్కెట్ సెంటర్లో టీడీపీ మైనారిటీ నేతలు కరిముల్లా, బాజీ ఆధ్వర్యంలో మంగళవారం ఇమామ్, మౌజన్లకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ బాజీ సాహెబ్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు మగ్బుల్ బేగ్, తదితర నేతలు పాల్గొని రంజాన్ తోఫా పంపిణీ చేశారు.