పశ్చిమ ప్రకాశంపై పగబట్టిన జ్వరం

ప్రకాశం: ఒక్కసారిగా మారిన వాతావరణం, కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పశ్చిమ ప్రకాశంలో జ్వరాల తీవ్రత పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా మార్కాపురంలోని సర్వజన వైద్యశాలకు రోజుకు సగటున 70మంది వరకు బాధితులొస్తున్నారు. వీటిలో చాలావరకు వైరల్ జ్వరాలే ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.