రాచకొండలో బాధ్యతలు స్వీకరించిన డీసీపీలు
MDCL: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు డీసీపీలు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. మహేశ్వరం డీసీపీగా కే. నారాయణ రెడ్డి ఐపీఎస్, అలాగే మల్కాజ్‌గిరి డీసీపీగా సిహెచ్ శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డీసీపీలు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.