నానో యూరియా అవగాహన సదస్సు

WGL: జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామంలో గురువారం డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ ప్రదర్శన, అవగాహన కార్యక్రమం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. నానో యూరియా వాడకం వల్ల పంటలకు నత్రజని అంది, రైతులకు ఖర్చు, శ్రమ తగ్గుతాయన్నారు.