‘డీహెచ్‌పీఎస్ మహాసభలు జయప్రదం చేయాలి’
MNCL: ఈ నెల 17,18 తేదీలలో వరంగల్‌లో జరగనున్న దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర 2వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఇవాళ క్యాతనపల్లిలో మహాసభల వాల్ పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ మహాసభల్లో దళితుల అభివృద్ధి, దళితులపై జరుగుతున్న దాడులపై చర్చించి భవిష్యత్తు పోరాటాలను రూపొందించనున్నట్లు తెలిపారు.