ఫలాలంకరణలో సిద్ది వినాయకుడి దర్శనం

SRD: పటాన్ చెరు మండలం రుద్రారం శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో వార్షిక, బ్రహ్మోత్సవాల్లో చతుర్దశి సందర్బంగా శనివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి వినాయక స్వామి ఫలాలంకరణలో దివ్య దర్శనమిచ్చారు. 11వ రోజు పురస్కరించుకొని వివిధ పండ్లు, ఫలాలతో అలంకరించి, మంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.