ఫ్లోరైడ్ నీరు తాగొద్దు.. జిల్లా అధికారి హెచ్చరిక

KRNL: ఫ్లోరైడ్ కలుషిత నీరు తాగితే ఆరోగ్య సమస్యలు కలుగుతాయని కర్నూలు జిల్లా అధికారి డాక్టర్ మహేశ్వర్ ప్రసాద్ హెచ్చరించారు. వెల్దుర్తిలో సంచార చికిత్సా కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు ఫ్లోరోసిస్‌పై అవగాహన కల్పించారు. దంతాల రంగు మారడం, కీళ్లనొప్పులు, కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు.