ముగిసిన కొండపోచమ్మ వార్షికోత్సవాలు

ముగిసిన కొండపోచమ్మ వార్షికోత్సవాలు

SDPT: జగదేవ్‌పూర్(M) తీగుల్‌ నర్సాపూర్‌ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ అమ్మవారి 24వ ఆలయ వార్షికోత్సవాలు ఇవాళ్టితో ముగిశాయి. ఉత్సవాల్లో ఇవాళ చివరి రోజు కవడంతో వేదమంత్రోచ్ఛరణల మధ్య శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవికుమార్ పాల్గొన్నారు.