రేపు తెనాలి శివాలయం హుండీ ఆదాయం లెక్కింపు
GNTR: తెనాలి గంగానమ్మపేటలో పాత శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వత వర్ధిని సమేత రామేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణాధికారిణి రమణ కుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మూడు నెలల తర్వాత జరుగుతున్న ఈ లెక్కింపులో భక్తులు కూడా పాల్గొనవచ్చని, పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి ఉండాలని సూచించారు.