KCRను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు: బీజేపీ
TG: KCR, రేవంత్ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. వీరిద్దరు ఒకరి కాళ్లు ఒకరు మొక్కుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పూర్తి విచారణకు ఇవ్వలేదని.. ఇచ్చింది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మాత్రమేనని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపవని వ్యాఖ్యానించారు.