VIDEO: పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి అదృశ్యం

VIDEO: పెన్షన్ సొమ్ముతో సచివాలయ ఉద్యోగి అదృశ్యం

ASR: ఎం.మాకవరం సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్ పెన్షన్ సొమ్ముతో అదృశ్యమయ్యాడు. దీంతో తమకు పెన్షన్ అందలేదని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ము రూ.2 లక్షల 81 వేలు మంజూరు కాగా, నిన్నటి నుంచి వెటర్నరీ అసిస్టెంట్ తమకు అందుబాటులో లేడని ఎంపీడీవో ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఎం.మాకవరం, చింతలపూడి పంచాయతీ కార్యదర్శులు తమకు ఫిర్యాదు చేశారన్నారు.