ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకుల నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.