మాజీ సర్పంచ్ కడారి శ్రీనివాస్ సస్పెండ్
KNR: కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ మాజీ సర్పంచ్ కడారి శ్రీనివాస్‌ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కొత్తపల్లి రూరల్ మండల అధ్యక్షుడు కుంట తిరుపతి తెలిపారు. శ్రీనివాస్ పై ప్రాథమిక సభ్యత్వం రద్దుచేసి చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ ఉన్నత నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.