టిష్యూ పేపర్ యూనిట్‌తో విజయగాథ రాసిన మంజుల

ATP: బుక్కరాయసముద్రం మండలం వడియంపేట గ్రామానికి చెందిన మంజుల స్వయం సహాయక సంఘం ద్వారా రూ. 4 లక్షల లోన్ తీసుకుని టిష్యూ పేపర్ తయారీ యూనిట్‌ను స్థాపించారు. ఈ యూనిట్‌ను విజయవంతంగా నిర్వహిస్తూ నెలకు రూ. 75 వేల ఆదాయం పొందుతూ మరో ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం మహిళలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది.