కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: రాంచందర్ రావు

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లి తెస్తామన్న పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే, పరీక్షలు నిర్వహించడంలో కూడా ప్రభుత్వం అసమర్థత చూపించిందని మండిపడ్డారు.